'చక్కెర' వ్యాధికి చవకైన మందు!

28 Jun, 2016 11:50 IST|Sakshi
'చక్కెర' వ్యాధికి చవకైన మందు!

బెంగళూరు: టైప్-2 మధుమేహ వ్యాధి చికిత్స కోసం శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధక మండలి(సీఎస్‌ఐఆర్) సోమవారం కొత్తగా ఆయుర్వేదిక్ యాంటీబయోటిక్ ఔషధం బీజీఆర్-34ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఔషధం రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రణలో ఉంచి, శరీరంపై ఇతర ఔషధాల దుష్ర్పభాలను తగ్గింస్తుందని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎన్‌బీఆర్‌ఐ) శాస్త్రవేత్త ఏకేఎస్ రావత్ తెలిపారు.

లక్నోలోని ఎన్‌బీఆర్‌ఐ, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడిసినల్, అరోమాటిక్ ప్లాంట్స్(సీఐఎంఏపీ) సంస్థలు సంయుక్తంగా ఈ ఔషధాన్ని అభివృద్ధిచేశాయి. కర్ణాటక సహా సరిహద్దు రాష్ట్రాలో 5 రూపాయలకే దీన్ని ఆయుర్వేదిక్ ఫార్మా సంస్థ ఏఐఎంఐఎల్ ముందుకు వచ్చింది. కస్తూరి పసుపు, ఏగిస, తిప్పతీగ, మంజిష్ట, పొడపత్రి, మెంతులు తదితరాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ ఔషధాన్ని తయారుచేశారు.

>
మరిన్ని వార్తలు