శ్రీనగర్లో కర్ఫ్యూ ఎత్తివేత

26 Jul, 2016 12:55 IST|Sakshi

శ్రీనగర్ : జమ్మాకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో కర్ఫ్యూను  ప్రభుత్వం ఎత్తివేసింది. ఆందోళన పరిస్థితులు సద్దుమణగడంతో ఆంక్షలు తొలగించినట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు. దీంతో 17 రోజుల తర్వాత ఆంక్షలతో పాటు కర్ఫ్యూ ఎత్తివేయటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు కర్ఫ్యూ ఎత్తివేయటంతో సాధారణ పరిస్థితులు నెలకొనటంతో వ్యాపార సముదాయాలు తెరుచుకున్నాయి. ఇక ఆందోళనల సందర్భంగా పెల్లెట్ గాయాలైన వారికి సీఆర్ఫీపీఎఫ్ డీజీ క్షమాపణ తెలిపారు. తక్కువ ప్రమాదం గల పెల్లెట్స్ వాడటానికి ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అలాగే మొబైల్, ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించారు.

కాగా హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానీ ఎన్‌కౌంటర్‌తో మొదలైన అల్లర్లను అదుపుచేసే క్రమంలో కశ్మీర్ లోయ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన అల్లర్లలో 47మంది మృతి చెందగా, 5500మంది గాయపడ్డారు. కాగా అనంత్నాగ్ జిల్లాలో మాత్రం కర్ఫ్యూ కొనసాగుతున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు వేర్పాటువాదులు బుధవారం ర్యాలీకి పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు