జమ్మూ అల్లర్లలో 64కు చేరిన మృతుల సంఖ్య

16 Aug, 2016 11:31 IST|Sakshi

న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు,ఐబీ, రా చీఫ్లు పాల్గొన్నారు. మరోవైపు కశ్మీర్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.. పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడంతో... 39వ రోజు కూడా శ్రీనగర్‌తో పాటు పది జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది.

మరోవైపు  జనజీవనం పూర్తిగా స్తంభించింది.ఇక అల్లర్లు జరిగే అవకాశం ఉండటంతో అక్కడక్కడ అదనపు బలగాలను మోహరించారు. వేర్పాటువాదుల బంద్ పిలుపుతో  విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు, రవాణా వ్యవస్థతో పాటు దుకాణాలు గత నెల 9వ తేదీ నుంచి మూతపడిన విషయం తెలిసిందే.  ఈ నెల 18 వరకూ ఈ బంద్ కొనసాగనుంది. కాగా బుద్గావ్లో భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు ఆందోళనకారులు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకూ జమ్ము అల్లర్లలో చనిపోయినవారి సంఖ్య 64కి చేరింది.

మరిన్ని వార్తలు