చెన్నై రైల్లో భారీ లూటీ

10 Aug, 2016 04:29 IST|Sakshi
చెన్నై రైల్లో భారీ లూటీ

5.78 కోట్ల ఆర్‌బీఐ సొమ్ము ఎత్తుకెళ్లినదుండగులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాష్ట్రం సేలం నుంచి చెన్నై ఎగ్మూరుకు వస్తున్న రైలులో రూ.5.78 కోట్ల డబ్బును దొంగలు దోచుకెళ్లారని పోలీసులు తెలిపారు. చిరిగిపోయిన, 2005కు ముందు ముద్రించిన నోట్లను సేలం నుంచి చెన్నై ఆర్‌బీఐ (భారతీయ రిజర్వు బ్యాంకు) శాఖకు తరలిస్తుండగా దొంగతనం జరిగింది. ఈ నోట్ల మొత్తం విలువ రూ.340 కోట్లు కాగా దొంగలు రూ.5 కోట్లను ఎత్తుకెళ్లారు. నోట్లను 226 చెక్కడబ్బాల్లో అమర్చి, మూడు ప్రత్యేక బోగీల్లో పెట్టారు. బోగీలను సోమవారం రాత్రి సేలం-ఎగ్మూరు రైలుకు తగిలించి చెన్నైకి తరలిస్తుండగా మార్గమధ్యంలో దొంగతనం జరిగింది. మూడు బోగీల్లో ఒకదానికి పైన రంధ్రం వేసి ఉంది.

అందులోని 4 చెక్కడబ్బాలను పగ లగొట్టి దొంగలు డబ్బు దోచుకెళ్లారు. రైలు మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు చెన్నై ఎగ్మూరుకు చేరుకుంది. డబ్బు స్వాధీనం చేసుకోడానికి స్టేషన్‌కు 11 గంటలకు వచ్చిన ఆర్‌బీఐ అధికారులు బోగీ పైభాగంలో మనిషి దూరేంత రంధ్రం ఉండడాన్ని గుర్తించారు. రూ.5 కోట్ల డబ్బు మాయమైనట్లు ప్రకటించారు. సేలం-విరుధాచలం  స్టేషన్ల మధ్య ైరె లు పట్టాలపై విద్యుత్తు తీగలు లేవనీ, కాబట్టి రైలు ఈ స్టేషన్ల మధ్య ఉన్నపుడే దొంగలు బోగీపైన రంధ్రం చేసుకుని లోపలికి దిగి దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు