వెంటనే బంగారం అమ్మేయండి

12 Dec, 2016 14:44 IST|Sakshi
వెంటనే బంగారం అమ్మేయండి

కస్టమ్స్‌ విభాగానికి రెవెన్యూ శాఖ ఆదేశాలు

న్యూఢిల్లీ: స్వాధీనం చేసుకున్న బంగారం అమ్మడానికి సత్వర చర్యలు చేపట్టాలని కస్టమ్స్‌ విభాగాన్ని రెవెన్యూ శాఖ కోరింది. ఇందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు(బంగారం అమ్మకం, దిగుమతికి ఆర్‌బీఐ అనుమతి ఉన్నవి), ఎంఎంటీసీ(మెటల్స్‌ అండ్‌ మినరల్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా), ఎస్‌టీసీ(స్టేట్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) సేవలు వినియోగించుకోవడానికి అనుమతిచ్చింది.

ఇంతకు పూర్వం కేవలం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ద్వారానే అమ్మకాలు చేపట్టేవారు. బంగారం ఏ రూపంలో ఉన్నా దాని అమ్మకం ధరను అంతకు ముందు రోజున్న మార్కెడ్‌ ధర ఆధారంగా నిర్ణయిస్తారు. అమ్మినందుకు బ్యాంకులు కస్టమ్స్‌ విభాగం నుంచి ఎలాంటి కమిషన్‌ ఆశించకూడదు. అయితే ఈ ప్రక్రియకు అయ్యే ఖర్చులను తిరిగి చెల్లిస్తారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలోని కస్టమ్స్‌ నిల్వల నుంచి సుమారు 67.4 కిలోల బంగారం కనిపించకుండా పోయిందని పార్లమెంటులో ప్రభుత్వం ప్రకటించింది. గత మూడేళ్ల (2013–2016) కాలంలో న్యూఢిల్లీ, ముంబై, త్రిచీ విమానాశ్రయాల్లో కస్టమ్స్‌ విభాగాల నుంచి 12 సందర్భాల్లో సుమారు 65.39 కిలోల బంగారం మాయమైనట్లు గుర్తించారు.

మరిన్ని వార్తలు