అధికారుల కేసుల విచారణ ఇకపై వేగవంతం

18 Jul, 2016 14:10 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ అధికారులు, బ్యాంకు ఉన్నతాధికారులకు సంబంధించి రూ.10 కోట్లకుపైన అవినీతికి పాల్పడిన కేసుల్లో దర్యాప్తును త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) నిర్ణయించింది. అలాగే అవినీతి నిరోధానికి సుప్రీంకోర్టు, హైకోర్టు, సీవీసీ, కేంద్ర ప్రభుత్వం సూచించే కేసులకూ, పార్లమెంట్ కమిటీలు కోరే నివేదికలకు సంబంధించిన విచారణ కు ప్రాముఖ్యత ఇవ్వాలని తీర్మానించింది.

వీటితోపాటు ఆరు నెలల్లో రిటైరయ్యే లేదా పదవీ విరమణ చేసిన అధికారుల్లో ఎవరైనా ఇలాంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటుంటే కాలపరిమితిలోగా దర్యాప్తును ముగించాలని నిర్ణయం తీసుకుంది. 

మరిన్ని వార్తలు