దాద్రి నిందితుడు జైలులో మృత్యువాత

5 Oct, 2016 10:09 IST|Sakshi
దాద్రి నిందితుడు జైలులో మృత్యువాత

నోయిడా: దేశంలో సంచలనం సృష్టించిన దాద్రి ఘటనకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒక యువకుడు చనిపోయాడు. ప్రస్తుతం జైలులోనే ఉన్న అతడు మృత్యువాత పడ్డాడు. డెంగ్యూ లేదా చికెన్ గునియావంటి వ్యాధుల కారణంగా అతడు చనిపోయి ఉండొచ్చని పోలీసులు చెబుతుండగా తమ కుమారుడిని పోలీసులే హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ లోని దాద్రిలో ఇంట్లో గోమాంసం ఉందని, గోహత్యకు పాల్పడ్డాడని మహ్మద్ అక్లాక్ అనే వ్యక్తిని కొంతమంది వ్యక్తులు కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి 15మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో బిసదా ప్రాంతానికి చెందిన రవీణ్ 22 ఏళ్ల యువకుడు కూడా ఉన్నాడు. అతడిని గ్రేటర్ నోయిడాలోని లుక్సార్ జైలులో వేశారు. గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆ యువకుడు చనిపోయినట్లు పోలీసులు చెప్పారు. పలు ఆస్పత్రులకు తిప్పినా అతడు కోలుకోలేదని అన్నారు.

మరిన్ని వార్తలు