ట్రెండింగ్ డాల్గొనా పెగ్ విస్కీ ఛాలెంజ్‌

13 Apr, 2020 20:33 IST|Sakshi

క‌రోనా క‌ట్ట‌డికి  సామాన్యుల నుంచి సెల‌బ్ర‌టీల వ‌ర‌కు అంద‌రూ ఇళ్ల‌లోనే ఉండాల్సిన ప‌రిస్థితి. దీంతో లాక్‌డౌన్ పుణ్య‌మా అని  చాలామంది వారిలో ఉన్న  సృజ‌నాత్మ‌క‌తను బ‌య‌ట‌పెడుతున్నారు. మొన్న‌టివ‌ర‌కు సోష‌ల్ మీడియాలో దుమ్మురేపిన డాల్గొనా కాఫీ ట్రెండ్‌కి ఇప్ప‌డు ఇంకోటి వ‌చ్చి చేరింది. అదే డాల్గొనా పెగ్‌. డాల్గొనా కాఫీలానే డాల్గొనా పెగ్ త‌యారు చేయ‌డం చాలా సులువు కావ‌డంతో ఇప్ప‌డు ఇది డాల్గొనా కాఫీని రీప్లేస్ చేసింది.

డాల్గొనా పెగ్‌కి కావ‌ల్సినవి
1. నీళ్లు
2. విస్కీ
3. ఏదైనా వ‌స్ర్తం

ముందుగా ఓ గ్లాస్‌లో 3 వంతుల నీళ్లు పోయాలి. పైనుంచి ఓ వ‌స్ర్తంతో కప్పి ఉంచుతూ మెల్లిగా నీళ్ల‌ను తాకుతూ క్లాత్‌ను కిందికి జార‌విడ‌వాలి. రెండు టేబుల్ స్ఫూన్ల విస్కీని వ‌స్ర్తం పైనుంచి పోయాలి. త‌ర్వాత నెమ్మ‌దినెమ్మ‌దిగా ఆ వస్ర్తాన్ని తీసేయాలి. అంతే డాల్గొనా కాఫీలానే డాల్గొనా విస్కీ పైన తేలియాడుతూ క‌నిపిస్తుంది. ఇప్ప‌డు ఇది సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

దేశ‌వ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ విధించిన ప్ర‌భుత్వం..నిత్య‌వ‌స‌రాలు, మందులు మిన‌హా మిగ‌తా అమ్య‌కాల‌పై నిషేదం విధించింది. దీంతో మ‌ద్యం ల‌భించక చాలామంది మ‌ద్యం బానిస‌లు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు. దీంతో మందుబాబుల‌కు వ‌రం ప్ర‌సాదిస్తూ డాక్ట‌ర్ ప్రిస్రిప్ష‌న్ లెట‌ర్ ఉంటే మ‌ద్యం స‌రఫ‌రా చేయాల‌ని కేర‌ళ ప్ర‌భుత్వం నోటీసులు జారీచేసింది. ఆ త‌ర్వాత ప‌శ్చిమ‌బెంగాల్‌లో మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌భుత్వం కూడా ప‌రిమిత పాస్‌ల ద్వారా మ‌ద్యాన్ని డోర్ డెలివ‌రీ చేసేందుకు అనుమ‌తిచ్చింది. ఇక క‌ర్ణాట‌క‌లో ఆదాయాన్ని పెంచే ప్ర‌య‌త్నంలో భాగంగా ఏప్రిల్ 14 త‌ర్వాత మ‌ద్యం అమ్మ‌కాలపై ఉన్న ఆంక్ష‌ల‌ను ఎత్తివేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు సీఎం య‌డియూర‌ప్ప ప్ర‌క‌టించారు.

దేశంలో అత్య‌ధిక మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేసే బాకార్డి, రెమీ మార్టిన్ లాంటి కంపెనీలు సామాజిక దూరం,  నిబంధ‌న‌లు పాటిస్తూ ప‌రిమిత సంఖ్య‌లో అయినా మ‌ద్యం విక్ర‌యించ‌డానికి అనుమ‌తి ఇవ్వండంటూ కేంద్రాన్ని కోరాయి. ఇక భార‌త్‌లోనూ క‌రోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంట‌ల్లోనే కోవిడ్ కార‌ణంగా 35 మంది ప్రాణాలు విడువగా, 706  కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య  9,152 కు చేరుకోగా, 308 మంది చ‌నిపోయారు.

మరిన్ని వార్తలు