అగ్రవర్ణాల దాడిలో గాయపడ్డ దళితుడి మృతి

7 May, 2019 13:46 IST|Sakshi

నైనిటాల్‌ : ఉత్తరాఖండ్‌లో గతనెల 26న ఓ వివాహ రిసెప్షన్‌లో తమ ఎదురుగా భోజనం చేసినందుకు అగ్ర వర్ణాల చేతిలో భౌతిక దాడికి గురైన దళిత యువకుడు మరణించాడు. దాడికి పాల్పడిన ఏడుగురు వ్యక్తుల్లో ముగ్గురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు నిందితులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. తక్కువ కులానికి చెందినప్పటికీ తమ సరసన భోజనం చేశాడనే ఆగ్రహంతో జితేంద్ర అనే దళితుడిని తెహ్రి జిల్లా ష్రికోట్‌ గ్రామంలో అగ్రకులాల వ్యక్తులు చితకబాదారని పోలీసులు తెలిపారు.

కాగా, బాధితుడు తొమ్మది రోజుల పాటు డెహ్రడూన్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. జితేంద్ర సోదరి ఫిర్యాదుతో ఏడుగురు నిందితులు గజేంద్ర సింగ్‌, శోభన్‌ సింగ్‌, కుషాల్‌ సింగ్‌, గబ్బర్‌ సింగ్‌, గంభీర్‌ సింగ్‌, హర్బీర్‌  సింగ్‌, హుకుం సింగ్‌లపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు