గుండు కొట్టించి, చెప్పుల దండ వేసి..

16 Feb, 2016 17:03 IST|Sakshi
గుండు కొట్టించి, చెప్పుల దండ వేసి..

ఉత్తరప్రదేశ్‌లోని దబౌలి గ్రామంలో అమానుషం చోటుచేసుకుంది. భూవివాదంలో పోలీసులకు ఫిర్యాదుచేశారనే అక్కసుతో  ఓ దళిత బాలుడిని దారుణంగా అవమానించారు. అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదుచేశాడనే ఆగ్రహంతో అతడికి గుండుకొట్టించి, మెడలో చెప్పుల దండ  వేసి ఊరంతా తిప్పారు. స్థానిక ఇటుకబట్టీ యజమాని, మరో ఇద్దరు ఉద్యోగులు ఈ దారుణానికి ఒడిగట్టారు.

అయితే ఇటుకబట్టీ నిర్వహించే స్థలానికి పక్కనే ఉన్న బాధితుల పూర్వీకుల భూమిని కబ్జా చేయడానికి వీరేంద్ర ప్రయత్నించడంతో వివాదం రాజుకుంది. తమ భూమిని అక్రమంగా ఆక్రమించుకోవాలని చూస్తున్నాడంటూ దళిత బాలుని తండ్రి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే సదరు యజమాని ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇటుక బట్టీ యజమాని వీరేంద్ర కుమార్ మిశ్రాతో పాటు మిగిలిన ఇద్దరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీస్ అధికారి తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు