లక్ష్మీ దేవికి అవమానం

4 Nov, 2017 12:57 IST|Sakshi

వరి పంట సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం

రైతులు వరికి నిప్పు పెట్టొదు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దామోదర్‌ రౌత్‌

భువనేశ్వర్‌: వరి పంటకు చీడపీడలు ఆవరించడంతో కలవరపడుతున్న రైతాంగం పొలాల్లో పంటకు నిప్పు పెట్టి ఆవేదన వ్యక్తం చేయడం తప్పు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి డాక్టరు దామోదర్‌ రౌత్‌ అన్నారు. వరి పంట సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. వర్థమాన పరిస్థితుల దృష్ట్యా పంటకు నిప్పు పెట్టడం అంటే లక్ష్మీ దేవిని దహించినట్లే అవుతుందన్నారు. ఇటువంటి తప్పిదానికి పాల్పడరాదని అన్నదాతను అభ్యర్థించారు.

నకిలీ మందుల విక్రేతలపై చర్యలు తప్పవు
రైతులకు నకిలీ క్రిమి సంహారక మందుల్ని విక్రయించిన వారిని గుర్తించి ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని ఆయన అన్నారు. బాధ్యుల్ని ఖరారు చేసిన మేరకు విభాగం వీరి వ్యతిరేకంగా చర్యల్ని చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుందని ప్రకటిం చారు. ముగ్గురు స భ్యుల బృందాన్ని వ్యవసాయ విభా గం ప్రభావిత ప్రాం తాలకు పంపించి ందన్నారు. క్షేత్ర స్థా యిలో వాస్తవ స్థితిగతుల్ని క్షుణ్ణంగా ప రిశీలించిన మేరకు వీరితో సంప్రదించి భావి కార్యాచరణ ఖరారు చేయడం జరుగుతుందని తెలిపారు. బర్‌గడ్, సంబల్‌పూర్, రాయగడ, గంజాం జిల్లాల్లో రైతులు వరి పంటకు నిప్పు పెడుతున్నట్టు విభాగానికి ఇప్పటివరకు సమాచారం అందినట్టు మంత్రి చెప్పారు.

మరిన్ని వార్తలు