జేఈఈ, నీట్‌ పరీక్షలపై ప్రకటన రేపు

4 May, 2020 05:49 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదివారం శుభవార్త వినిపించింది. లాక్‌డౌన్‌ వల్ల వాయిదా పడిన జేఈఈ–మెయిన్స్, నీట్‌ పరీక్షల నిర్వహణపై మే 5వ తేదీన కేంద్ర మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ ప్రకటన చేస్తారని, అదేరోజు కొందరు విద్యార్థులతో ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడుతారని పేర్కొంది. ఈ ఏడాది నీట్‌ పరీక్ష రాసేందుకు 15 లక్షల మంది, జేఈఈ–మెయిన్స్‌ రాసేందుకు 9 లక్షల మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేసుకున్నవారు దాన్ని మార్చుకోవచ్చు.

మరిన్ని వార్తలు