కేంద్ర మంత్రులతో దత్తాత్రేయ భేటీ

13 Apr, 2016 18:33 IST|Sakshi

న్యూఢిల్లీ: తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులను కేంద్ర మంత్రి దత్తాత్రేయ కేంద్ర మంత్రులు రాధామోహన్ సింగ్, బీరేంద్ర సింగ్ల దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం దత్తాత్రేయ.. వీరిద్దరినీ కలసి తెలంగాణలో కరువు పరిశీలనకు క్షేత్రస్థాయి పర్యటనకు రావాలని కోరారు. తాగునీరు, పశుగ్రాసానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని దత్తాత్రేయ కోరారు.

కేంద్ర ప్రభుత్వం కరువు నిధులు మంజూరు చేసినా తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేయలేదని కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ చెప్పారు. 319 కోట్ల రూపాయల కరువు నిధులు ఖర్చు చేయలేదని వివరించారు. అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చిన నిధులను కరువు ప్రాంతాల్లో యుద్ధప్రతిపాదకన నిధులు ఖర్చు చేయాలని, తాగునీరు, పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు.

మరిన్ని వార్తలు