ఉద్వేగానికి లోనైన బన్సూరి స్వరాజ్‌

8 Aug, 2019 14:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గుండెపోటుతో హఠాన్మరణానికి గురైన బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ అస్థికలను ఆమె కుమార్తె బన్సూరి స్వరాజ్‌ గురువారం యూపీలోని హపూర్‌ వద్ద గంగా జలాల్లో నిమజ్జనం చేస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. తండ్రి స్వరాజ్‌ కౌశల్‌ వెంట రాగా బన్సూరి స్వరాజ్‌ ఈ క్రతువును నిర్వహించారు.

67 సంవత్సరాల సుష్మా స్వరాజ్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి తీవ్ర గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అధికార లాంఛనాల నడుమ బుధవారం ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు