దావూద్‌ చనిపోతే.. వారసుడెవడు?

26 Apr, 2016 17:18 IST|Sakshi
దావూద్‌ చనిపోతే.. వారసుడెవడు?

ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు ప్రాణ గండం సమీపించిందనే కథనాల నేపథ్యంలో దావూద్‌ వారసుడు ఎవరన్నది కీలకంగా మారింది. దావూద్ కాళ్లలో గ్యాంగ్రీన్(శరీరభాగం కుళ్లడం)తో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడని, ఆయనకు సోకిన గ్యాంగ్రీన్ చివరిదశలో ఉందని వైద్యులు తేల్చి చెప్పినట్లు తాజాగా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కథనాలు నిజం కావని, దావూద్‌ బలంగానే ఉన్నాడని అతని రైట్ హ్యాండ్‌ ఛోటా షకిల్ చెప్తున్నప్పటికీ.. దావూద్‌ చనిపోతే అతని స్థానంలో మాఫియా నేరప్రపంచం పగ్గాలు ఎవరు చేపడతారు? ముంబై మాఫియాను ఎవరు నడిపిస్తారన్నది? చర్చనీయాంశంగా మారింది.

ముంబై అండర్‌ వరల్డ్ కేసులు ఎన్నింటినో దర్యాప్తు చేసిన మాజీ పోలీసు అధికారి ఒకరు స్పందించారు. దావూద్ చనిపోతే.. అతని వీరవిధేయుడైన ఛోటా షకీల్‌ వారసుడిగా పగ్గాలు చేపట్టే అవకాశముందని వెల్లడించారు. 'దావూద్‌ స్థానంలో ఛోటా షకీలే పగ్గాలు చేపట్టే అవకాశముంది. షకీల్‌కు దూకుడు ఎక్కువ' అని ముంబై మాజీ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ షంషేర్‌ ఖాన్ పఠాన్ తెలిపారు. అయితే, దావూద్ విషమపరిస్థితిలో ఉన్నాడని, రేపోమాపో అన్నట్టుగా అతని పరిస్థితి ఉందన్న కథనాలపై ఆయన సందేహం వ్యక్తం చేశారు.

మరోవైపు దావూద్ ఇబ్రహీం చాలా బలంగా ఉన్నాడని ఆయన కీలక అనుచరుడు చోటా షకీల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని, ప్రాణ గండం సమీపించిందని మీడియాలో వచ్చిన కథనాలన్నీ కేవలం కట్టుకథలు మాత్రమే అని అతను ఓ మీడియాకు తెలిపాడు. ఎవరో తప్పుడు సమాచారం ఇస్తే దానిని మీడియా అనవసరంగా ప్రచారం చేస్తోందని, దావూద్కు ఎలాంటి ప్రాణముప్పు లేదని చెప్పుకొచ్చాడు. ఏదీఏమైనా

>
మరిన్ని వార్తలు