యోగి ప్రతీకారం : రూ. 15 లక్షలు కట్టండి! 

25 Dec, 2019 16:03 IST|Sakshi
సీఏఏ నిరసనలు, పోలీసు పహరా(ఫైల్‌ ఫోటో)

సీఏఏ నిరసనలు, 28మందికి నోటీసులు

రూ. 14.86 లక్షలు కట్టండి 

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అన్నంత పనీ చేసింది. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా జరిగిన ఆందోళనకు, నష్టానికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పిన యోగీ ప్రభుత్వం   ఆందోళన కారులకు నోటీసులు పంపింది.  ఈ నిరసన కార్యక్రమంలో చెలరేగిన హింస సందర్భంగా ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టానికి రూ .14.86 లక్షలు రికవరీ కోసం దాదాపు 28 మందికి నోటీసులు అందాయి. అంతేకాదు  దెబ్బతిన్న పోలీసు హెల్మెట్లు, లాఠీలు, పెలెట్స్‌ కోసం కూడా  పరిహారం చెల్లించాలని కూడా యూపీ సర్కార్‌ ఆదేశించింది. 

కాగా గతవారం ఉత్తరప్రదేశ్ రాంపూర్లో సీఏఏ నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ హింసకు కారణమని ఆరోపిస్తూ 31మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించి వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని, వేలం వేస్తామని, తద్వారా నష్టాన్ని భర్తీ చేస్తామని, ప్రతీకారం తీర్చుకుంటామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  ప్రకటించిన సంగతి తెలిసిందే. 

మరోవైపు రాష్ట్ర పోలీసులు కనీసం 21 గురు మైనర్లను అదుపులోకి తీసుకుని, 48 గంటల పాటు చిత్ర హింసలకు గురిచేశారని హఫింగ‍్టన్‌ పోస్ట్‌ నివేదించింది. స్థానిక పత్రికల కథనాలు,   బాధితుల ఇంటర్వ్యూల (విడుదలైన 21 మందిలో ఐదుగురిని) ఆధారంగా బహిరంగ ప్రదర్శనకు ఎప్పుడూ హాజరుకావద్దంటూ వారిని బెదిరించడంతోపాటు తీవ్రంగా కొట్టారని తెలిపింది. చేసింది, అయితే దీనిపై ఉత్తరప్రదేశ్‌ డీజీపి ఓపీ సింగ్, బిజ్నోర్ జిల్లా కలెక్టర్ రామకాంత్ పాండే , బిజ్నోర్ ఎస్‌పీ సంజీవ్ త్యాగి ఇంకా స్పందించాల్సి వుందని పేర్కొంది.

 చదవండి :  వాళ్ల ఆస్తులు వేలం వేస్తాం: యూపీ సీఎం

మరిన్ని వార్తలు