జర్నలిస్టు మీద చేయి చేసుకున్న డీసీపీ : వీడియో వైరల్‌

3 Sep, 2019 15:13 IST|Sakshi

కోల్‌కతా : వార్తలను కవర్‌ చేయడానికి వెళ్లిన టీవీ జర్నలిస్టు మీద ఓ పోలీస్‌ ఆఫీసర్‌ చేయి చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియో సోమవారం వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది. వివరాల్లోకెళితే..  పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య  శనివారం నుంచి ఘర్షణలు జరుగుతున్నాయి. శనివారం బీజేపీ నేత, బరాక్‌పూర్‌ ఎంపీ అర్జున్‌ సింగ్‌ తలకు గాయమవడంతో ఆదివారం ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎంపీ అర్జున్‌ సింగ్‌ నివాసమైన ‘మజ్దూర్‌ భవన్‌’ లో ప్రవేశించడానికి డీసీపీ అజయ్‌ ఠాకూర్‌ ప్రయత్నించాడు. ఈ సంఘటనలను కవర్‌ చేయడానికి వెళ్లిన స్థానిక టీవీ జర్నలిస్టును డిప్యూటీ కమిషనర్‌ అజయ్‌ ఠాకూర్‌ చెంప మీద కొట్టిన వీడియో బయటపడింది. అయితే ఇంతకు ముందు కూడా అజయ్‌ ఠాకూర్‌ ఇలా ప్రవర్తించాడని అక్కడి జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. అంతేకాక, పోలీస్‌ కమిషనర్‌ మనోజ్‌ వర్మ కొట్టడం వల్లనే తన తలకు గాయమైందని ఎంపీ అర్జున్‌ సింగ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు