ప్ర‌మాద‌క‌ర కంటెంట్ల‌ను ఎలా నిలువ‌రిస్తారు?

21 May, 2020 18:44 IST|Sakshi

న్యూ ఢిల్లీ: నేరాలు కొత్త‌రూపం ఎత్తాయి. సోష‌ల్ మీడియా వ‌చ్చిన త‌ర్వాత అవి మ‌రింత వికృతంగా మారాయి. ఫొటోలు మార్ఫింగ్ చేయ‌డం, వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి క్రూర నేరానికి పాల్ప‌డ‌టం, నిస్సిగ్గుగా గ్రూపుల్లో అమ్మాయిని ఎలా అత్యాచారం చేయాల‌ని మాట్లాడుకోవ‌డం వీటికి ప‌రాకాష్ట‌. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన 'బాయ్స్ లాక‌ర్ రూమ్‌' గ్రూపులో జ‌రిగిన నీచ చేష్ట‌లివి. ఒక్క బాయ్స్ లాక‌ర్ రూమ్‌ గ్రూపు మాత్ర‌మే కాదు, ఇంకా తెలీని, వెలుగు చూడ‌ని ఇలాంటి క్రూర చేష్ట‌లు ఎన్నెన్నో. వీట‌న్నింటికి సోష‌ల్ మీడియా వేదిక‌గా మార‌డాన్ని సుమోటోగా తీసుకున్న‌ ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ గురువారం విచార‌ణ చేప‌ట్టింది. ('బాయ్స్ లాక‌ర్ రూమ్‌'లో కొత్త ట్విస్ట్)

అస‌భ్య వీడియోల‌కు, విద్వేష‌పూరిత చ‌ర్య‌ల‌కు, సమస్మాత్మక కంటెంట్ల‌కు సోష‌ల్ మీడియా ప్ర‌ధాన కేంద్రంగా మారింద‌ని అభిప్రాయ‌ప‌డింది. ఇవి నానాటికీ పెరిగిపోతున్నాయ‌ని పేర్కొంది. వీటిని ఎలా నిలువ‌రిస్తాలో తెలియ‌జేస్తూ.. అన్ని సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మే 25లోగా నివేదిక అంద‌జేయాల‌ని ఆదేశించింది. దీని గురించి మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ స్వాతి మ‌లివాల్ మాట్లాడుతూ.. సోష‌ల్ మీడియాలో పెద్ద సంఖ్య‌లో హింస‌ను, వేధింపుల‌ను ప్ర‌ధానంగా చిత్రీక‌రిస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా మ‌హిళ‌లు, పిల్ల‌లే బాధితులుగా ఉంటున్నారు. గ‌త కొద్ది రోజులుగా ఇలాంటి ప్ర‌మాద‌క‌ర అంశాలు ట‌న్నుల కొద్దీ వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి పోస్టులను నియంత్రించ‌డం క‌ష్ట‌సాధ్య‌మైన ప‌ని. ఎవరైనా హింస‌ను ప్రేరేపించేవిధంగా వీడియోలు పోస్ట్ చేస్తే వారిని త‌క్ష‌ణ‌మే వారిని ఆ సోష‌ల్ మీడియా యాప్ నుంచి నిషేధిస్తామ‌ని హెచ్చ‌రించారు. (ఆ కమిటీతో సోషల్‌ మీడియా గాడిన పడేనా..?)

మరిన్ని వార్తలు