ఢిల్లీ ధర్మాసుపత్రిలో దారుణం

19 Jun, 2017 10:31 IST|Sakshi
ఢిల్లీ ధర్మాసుపత్రిలో దారుణం

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో షాకింగ్‌ సంఘటన  చోటు చేసుకుంది.  కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని  సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యానికి  నిలువెత్తు నిదర‍్శనం ఈ ఉదంతం.  తక్కువ బరువుతోపుట్టిన శిశువు మరణించిందని అక్కడి డాక్టర్లు  ప్రకటించారు. అయితే  శిశువు ఖననం చేయబడటానికి తీసుకెళ్లినపుడు సజీవంగా ఉన్నట్లు బంధువులు గుర్తించడం కలకలం రేపింది.
 వివరాల్లోకి వెళితే బదర్‌పూర్‌కు చెందిన ఓ మహిళ పూర్తిగా నెలలు నిండకముందే ఆదివారం ఉదయం పాపకు జన్మనిచ్చింది. అయితే ఆ పాప ఊపిరితీసుకోవడం లేదని గుర్తించిన నర్సింగ్ సిబ్బంది చిన్నారి మరణించినట్టుగా ధ్రువీకరించి తండ్రి రోహిత్ కు అప్పగించారు. అయితే ఆరోగ్యం ఇంకా కుదుట పడకపోవడంతో తల్లి ఇంకా ఆసుపత్రిలోనే ఉంది. దీంతో పాపను ఇంటికి తీసుకెళ్లి సమాధి చేయడానికి సిద్ధపడుతుండగా,  పాప చిన్నగా ఏడ్వడాన్ని రోహిత్ సోదరి గమనించింది.  వెంటనే అక్కడున్నవారిని అప్రమత్తం చేసింది.   ప్యాప్‌ విప్పి చూశారు. పాప ఊపిరి తీసుకుంటూ కాళ్లూ, చేతులూ కదుపుతూ కనిపించింది. వెంటనే పీసీఆర్‌ చికిత్స అందింని అంబులెన్స్‌లో   స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.  డాక్టర్ల  బాధ్యతారాహిత్యంపై ఆవేదన వ్యక్తం చేస్తూ  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 దీనిపై ఆసుపత్రి అధికారులు  స్పందించారు.  డబ్ల్యుహెచ్‌వో  మార్గదర్శకాల ప్రకారం 22 వారాల ముందు జన్మించిన శిశువులు 500 గ్రా. బరువుతో పుడతారని దాదాపు బతికే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పారు.  ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని సఫ్దర్‌జంగ్ దవాఖాన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏకే రాయ్ చెప్పారు. ఇలాంటి ప్రీ మెచ్యూర్‌ డెలివరీ శిశువులను చనిపోయినట్లు ప్రకటించటానికి ముందు కనీసం సుమారు ఒక గంట పాటు పరిశీలనలో ఉంచాలని మరో డాక్టర్‌ చెప్పారు.
 

మరిన్ని వార్తలు