‘వాళ్ల వల్లే నా భర్త చనిపోయాడు’

1 Aug, 2019 11:13 IST|Sakshi

తిరువనంతపురం : ఉన్నత అధికారుల వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని కేరళకు చెందిన ఓ పోలీసు అధికారి భార్య ఆరోపించారు. గిరిజనులమైన కారణంగానే తమకు ఈ దుస్థితి పట్టిందని ఆవేదన చెందారు. అట్టాపడి ప్రాంతంలోని ఓ తండాకు చెందిన కుమార్‌ అనే వ్యక్తికి పాలక్కాడ్‌లోని ఆర్మ్‌డ్‌ విభాగంలో పోస్టింగ్‌ వచ్చింది. అయితే విధుల్లో చేరిన కుమార్‌ గత గురువారం ఓ రైల్వేట్రాక్‌ వద్ద శవమై తేలారు. ఘటనాస్థలంలో సూసైడ్‌ నోట్‌ లభించడంతో అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో కుమార్‌ పోస్టుమార్టం నివేదిక వెల్లడైన తర్వాతే పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి.

ఈ నేపథ్యంలో తన భర్త మృతిపై స్పందించిన కుమార్‌ భార్య సాజిని మీడియాతో మాట్లాడారు. సూసైడ్‌లో నోట్‌లో ఉన్నది తన భర్త చేతిరాతే అని ఆమె స్పష్టం చేశారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఉన్నత స్థాయి అధికారులు తన భర్తను వేధించేవారని ఆరోపించారు. ‘ నా భర్తను అకారణంగా పొట్టనబెట్టుకున్నారు. తనను వేధించిన అధికారుల పేర్లను ఆయన సూసైడ్‌ నోట్‌లో స్పష్టంగా రాశాడు. తన నేపథ్యం గురించి పై అధికారులు హేళనగా మాట్లాడేవారని నాతో చెప్పి  తరచూ బాధపడేవాడు. ఇటీవలే ఆయన కొత్త క్వార్టర్‌కు మారాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి పాలక్కాడ్‌ ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని సాజిని తెలిపారు. కాగా త్రిస్సూరు రేంజ్‌ డీఐజీ ఇప్పటికే ఈ కేసు దర్యాప్తునకై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మీ సోదరుడు అల్లా కోసం అమరుడయ్యాడు’

హెల్మెట్‌ పెట్టుకోలేదు; 4 గంటలు కరెంట్‌ బంద్‌!

నిమిషానికి 170 ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి..

మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని..

మూడేళ్ల చిన్నారి తల, మొండెం వేరు చేసి..

భారీ వర్షాలతో ఆ ఎయిర్‌పోర్ట్‌ మూసివేత

కాఫీ కింగ్‌కు కన్నీటి వీడ్కోలు

సల్ఫర్‌ ఎరువుపై రాయితీ 84 పైసలు పెంపు

‘అందరికీ ఇళ్లు’లో అడ్డంకులొద్దు

‘జల వివాదాల’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

సిట్టింగ్‌ జడ్జిపై సీబీఐ విచారణ

‘కాఫీ డే’ సిద్ధార్థ మృతి

ఆహారానికి మతం లేదు

హృదయ కాలేయం@వరాహం

ఒక్క కేసు; ఎన్నో ట్విస్ట్‌లు!

‘నా పేరు సాక్షి.. నాన్న పేరు సంతోష్‌’

ఈనాటి ముఖ్యాంశాలు

ఆ బాలుడి నోట్లో 526 దంతాలు!

రాయ్‌బరేలీ ప్రమాదంలో 25 మందిపై కేసు

పోలీసులకు చుక్కలు చూపించిన విద్యార్థిని

మోదీ, అమిత్‌ షాలతో నాదెండ్ల భేటీ

యుద్ధ ప్రాతిపదికన సమస్యలు పరిష్కరించాలి

‘అదృష్టం.. ఈ రోజు ముందు సీట్లో కూర్చోలేదు’

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు; కశ్మీర్‌లో పంచాయతీ..!

మట్టికుప్పల కింద మనిషి.. బతికాడా..!

క్రికెట్‌లో గొడవ.. కత్తెరతో పొడిచి హత్య

మూకదాడులు ఎలా చేయాలో నేర్పిస్తారేమో!

ఆరోగ్య మంత్రి మాటలు అమలయ్యేనా?

ఈ రాఖీలు వేటితో చేశారో చెప్పగలరా?

మోదీని అనుకరించారు.. అడ్డంగా బుక్కయ్యారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

శ్రీదేవి కల నెరవేరనుందా?

మళ్లీ బిజీ అవుతున్న సిద్ధార్థ్‌

అలాంటి సినిమాల్లో అస్సలు నటించను : రష్మిక

హీరోపై సినీనటి తల్లి ఫిర్యాదు..