చితిపై నుంచి లేచాడు!

14 Oct, 2019 04:06 IST|Sakshi

చితికి నిప్పంటించే క్షణంలో కళ్లు తెరిచి పైకి లేచిన వ్యక్తి

ఒడిశాలో ఘటన

భువనేశ్వర్‌: శాశ్వతంగా కన్నుమూశాడని భావించి, శ్మశానవాటికకు తరలించి చితికి నిప్పుపెట్టే సమయంలో ఆ వ్యక్తి హఠాత్తుగా కళ్లు తెరిచాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా కోలుకుంటున్నాడు. ఒడిశాలోని గంజాం జిల్లా సొరొడా సమితిలో ఉన్న హరిపూర్‌ గ్రామంలో ఆదివారం జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది. గ్రామానికి చెందిన మేకల కాపరి సీమాంచల్‌ మల్లిక్‌ శనివారం మేకలను మేపునకు తోలుకెళ్లాడు. సాయంత్రం మేకలు ఇళ్లకు చేరినా సీమాంచల్‌ మాత్రం రాలేదు. గాలించిన బంధువులు, గ్రామస్తులు అపస్మారకస్థితిలో ఉన్న అతడిని ఆదివారం కనుగొన్నారు. మల్లిక్‌ మరణించినట్లు భావించి అంత్యక్రియలకు శ్మశానవాటికకు తరలించారు. చితికి నిప్పుపెట్టే సమయంలో.. చుట్టిన వస్త్రాన్ని తొలగిస్తుండగా ఊపిరి ఆడుతున్నట్లు గమనించారు. అంతలోనే కళ్లు తెరిచిన మల్లిక్‌ను చూసి అతడు మరణించలేదని గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సతో అతడు కోలుకుంటున్నాడు.

4 రోజులుగా జ్వరం..
నాలుగు రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధపడిన తాను తగ్గినట్లు అనిపించడంతో శనివారం మేకలు తోలుకెళ్లినట్లు మల్లిక్‌ తెలిపారు. మధ్యాహ్నానికి మళ్లీ జ్వరం వచ్చి పడిపోయినట్లు చెప్పారు. తిరిగి మెలకువ వచ్చేసరికి చితిమీద ఉన్నట్లు పేర్కొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా