భారీ వర్షాలు.. ఇళ్లు కూలి 38 మంది మృతి

25 Jun, 2015 17:41 IST|Sakshi
భారీ వర్షాలు.. ఇళ్లు కూలి 38 మంది మృతి

అహ్మద్నగర్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుజరాత్లో ఇళ్లు కూలిపోయి దాదాపు 38 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికంగా ఆమ్రేయిల్ జిల్లాలో 28 మంది మృత్యువాత పడగా రాజ్కోట్లో నలుగురు, భవన్గర్లో ముగ్గురు, సూరత్లో ఇద్దరు బారుచ్, వల్సాద్ జిల్లాల నుంచి ఒక్కోక్కరూ ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవడంతో ముఖ్యమంత్రి ఆనంది బెన్ గురువారం ఏరియల్ సర్వే నిర్వహించారు.

ఈ ఘటనపై రాష్ట్ర పునరావాస శాఖ నుంచి ఓ అధికారి మాట్లాడుతూ భారీ వర్షం కారణంగా గ్రామాల్లో పలు ఇండ్లు నేల మట్టమయ్యాయని చెప్పారు. పలువురు ప్రాణాలు కోల్పోయారని, ప్రాణ నష్టానికి ఆస్తి నష్టానికి నిబంధనల మేరకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. అయితే, ఈ విషయంపై ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాతే గతంలో ఇచ్చినదానికంటే ఎక్కువ నష్టపరిహారం ఇప్పించాలనుకుంటున్నట్లు తెలిపారు. విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నదని, రవాణా స్థంబించిందని, పరిస్థితులు అస్తవ్యవస్థంగా మారాయని తెలిపారు. అయితే, ప్రస్తుతం కొంత మెరుగైన స్థితికి వచ్చినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు