లోక్‌సభలో కోతులపై చర్చ

22 Nov, 2019 09:12 IST|Sakshi

న్యూఢిల్లీ: మతపరమైన ప్రదేశాలలో కోతుల బెడద ఎక్కువగా ఉంటోందని మథుర బీజేపీ ఎంపీ హేమమాలిని తెలిపారు. దేశ రాజధానిలోని ల్యూటెన్స్‌ ప్రాంతంలోనూ కోతుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని గురువారం ఆమె లోక్‌సభలో ప్రస్తావించారు. తన నియోజకవర్గంలోని మథుర, బృందావన్‌లలో భక్తులు కోతుల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నారని, యాత్రికుల సామాన్లు కోతులు లాక్కుని పోతున్నాయన్నారు. ఢిల్లీలోని ల్యూటెన్స్‌ ప్రాంతంలో కోతుల భయంతో పిల్లలు ఆడుకోకుండా ఇళ్లలోనే ఉండిపోతున్నారని ఎల్‌జేపీ ఎంపీ చిరాగ్‌ పాశ్వాన్‌ అన్నారు. ‘ఒకసారి కోతి నా కళ్లజోడుని తీసుకెళ్లింది. దానికి పళ్లరసం ఇచ్చి కళ్లజోడును తిరిగి తీసుకోవాల్సి వచ్చింది’అని టీఎంసీ ఎంపీ సుదీప్‌ బంధోపాధ్యాయ అన్నారు.
 

మరిన్ని వార్తలు