పీఎన్‌బీకి 7,200 కోట్లు చెల్లించండి

7 Jul, 2019 05:02 IST|Sakshi

నీరవ్‌ మోదీకి రుణ రికవరీ ట్రిబ్యునల్‌ ఆదేశం

పుణే: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ)కు రూ. 7,200 కోట్లు వడ్డీతో కలిపి చెల్లించాలని పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని రుణ రికవరీ ట్రిబ్యునల్‌ శనివారం ఆదేశించింది. పీఎన్‌బీని మోసం చేసిన కేసులో నీరవ్‌ మోదీ ప్రస్తుతం లండన్‌ జైల్లో ఉన్నాడు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు అనుకూలంగా రుణ రికవరీ ట్రిబ్యునల్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ దీపక్‌ కుమార్‌ రెండు ఉత్తర్వులు జారీ చేశారు. ‘జూన్‌ 30, 2018 నుండి సంవత్సరానికి 14.30 శాతం వడ్డీతో రూ. 7,200 కోట్ల మొత్తాన్ని ఏకమొత్తంగా లేదా విడతలవారీగా దరఖాస్తుదారునికి (పీఎన్‌బీ) చెల్లించాలని ప్రతివాదిని, అతని భాగస్వాములను ఆదేశిస్తున్నట్టు డీఆర్‌టీ ఉత్తర్వులో పేర్కొంది. మరో ఉత్తర్వును వెలువరిస్తూ, జూలై 27, 2018 నుండి 16.20 శాతం వడ్డీతో రూ. 232 కోట్లు చెల్లించాలని న్యాయమూర్తి నీరవ్‌ని ఆదేశించారు. లేనిపక్షంలో అధికారులు తదుపరి చర్యలను ప్రారంభిస్తారని ట్రిబ్యునల్‌ అధికారి స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు