పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశంగా పరిగణించండి..

21 Sep, 2016 20:39 IST|Sakshi
పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశంగా పరిగణించండి..

న్యూఢిల్లీః పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలంటూ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. భారత ప్రభుత్వం పాకిస్థాన్ ను ఉగ్రవాద రాజ్యంగా పరిగణించాలని ఆయన కోరారు. పాకిస్థాన్ స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రర్ పేరున ఓ ప్రైవేట్ మెంబర్ బిల్లుతో పాటు, పార్లమెంట్ తీర్మానాన్ని రాజీవ్ ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపై శీతాకాల సమావేశాల్లో చర్చిస్తారని ఆశిస్తున్నట్లు ప్రధానికి సమర్పించిన లేఖలో పేర్కొన్నారు.

అమెరికా చట్టసభకు చెందిన ఇద్దరు సభ్యులు పాకిస్థాన్ కు వ్యతిరేకంగా స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం బిల్లును ఇప్పటికే ప్రతినిధుల సభలో ప్రవేశ పెట్టారని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా పాకిస్థాను ప్రకటించాలని వారు ఆ బిల్లులో కోరారని రాజీవ్ తన లేఖలో వివరించారు. ఆర్ 6069, లేదా పాకిస్థాన్ స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం బిల్లు ఆమోదంపై ఒబామా సర్కారు అధికారికంగా సమాధానం ఇవ్వాలని అమెరికా చట్టసభ సభ్యులు కోరినట్లు రాజీవ్ చంద్రశేఖర్ లేఖలో ప్రధానికి తెలిపారు.

>
మరిన్ని వార్తలు