తగ్గిన పెట్రో ధరలు

2 Apr, 2015 04:25 IST|Sakshi
తగ్గిన పెట్రో ధరలు

- పెట్రోల్‌పై 49 పైసలు, డీజిల్‌పై రూ. 1.21
 
 న్యూఢిల్లీ: ఇంధన ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. పెట్రోల్ ధర లీటరుకు 49 పైసలు, డీజిల్ ధర లీటరుకు రూ. 1.21 తగ్గాయి. తగ్గింపు బుధవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చింది. సబ్సిడీయేతర సిలిండర్ ధర మాత్రం రూ. 11 పెరిగి ఢిల్లీలో రూ. 621కి చేరుకుంది. ఢిల్లీలో పెట్రోల్  ధర రూ. 60.49 నుంచి రూ. 60కి, డీజిల్ ధర రూ. 49.71 నుంచి రూ. 48.50కి చేరుకున్నాయి. స్థానిక పన్నుల్లో తగ్గింపు కలుపుకుంటే ధరలు ఇంకొంత తగ్గుదల ఉంటుంది.

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 68.23 నుంచి రూ.67.69కి, డీజిల్ ధర రూ. 56.21 నుంచి రూ. 54.86 కు చేరింది. ‘అంతర్జాతీయ విపణిలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. అయితే డాలరు-రూపాయి మారకం విలువ తగ్గింది. ఫలితంగా రిటైల్ ధరల తగ్గించాల్సి వచ్చింది’ అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్  తెలిపింది. పెట్రోల్, డీ జిల్ ధరలు ఫిబ్రవరి 16న వరుసగా 82 పైసలు, 61 పైసలు, మార్చి 1న రూ. 3.18, రూ. 3.09 పెరగడం తెలిసిందే విమాన ఇంధనం(ఏటీఎఫ్) ధర తాజాగా కిలోలీటరుకు రూ. 1,025కు తగ్గి రూ. 49,338కి చేరుకుంది. ఏటీఎఫ్ ధర మార్చి 1న ఏకంగా 8.2 శాతం పెరగడం తెలిసిందే.

మరిన్ని వార్తలు