ఆర్మీలో పోర్టర్ల నియామకాలు

22 Mar, 2018 11:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత సైన్యంలో పాకిస్తాన్‌, చైనా సరిహద్దుల్లో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేలా నూతన విధానానికి రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నెలసరి వేతనంపై పోర్టర్లను భారత సైన్యం నియమించుకునేందుకు ఈ విధానం వెసులుబాటు కల్పిస్తుంది. పోర్టర్లకు నెలకు రూ 18,000 వేతనంతో పాటు వారు పనిచేసే ప్రాంతం, వాతావరణం, ప్రాణాపాయం వంటి అంశాల ప్రాతిపదికన కాంపెన్సేటరీ వేతనం, వైద్య సేవలు వంటి ఇతర సదుపాయాలను కల్పిస్తారు.

గతంలో ఆర్మీలో పోర్టర్లను రోజువారీ వేతనం కింద నియమించుకునేవారు. వారికి ఎలాంటి ఇతర సదుపాయాలూ అందుబాటులో ఉండేవి కావు. పోర్టర్లకు సరైన మౌలిక వసతులు కొరవడటంపై సుప్రీం కోర్టును ఆశ్రయించగా, పోర్టర్లకు మెరుగైన విధానాన్ని అందుబాటులోకి తేవాలని గత ఏడాది జనవరి 2న సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. 
 

మరిన్ని వార్తలు