ఢిల్లీ ఫలితాలు: విజయమైనా.. అపజయమైనా ఓకే

11 Feb, 2020 11:59 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2020 ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. గత ఎన్నికల కంటే బీజేపీ ఈసారి మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఈక్రమంలో బీజేపీ కార్యాలయంపై ప్రత్యక్షమైన ఓ బ్యానర్‌ ఆసక్తి రేపుతోంది. ‘విజయం మాకు అహంభావాన్ని కలిగించదు. అలాగే ఓటమి మమ్మల్ని నిరాశపరచదు’ అని బ్యానర్‌పై హిందిలో రాసి ఉంది. అదేవిధంగా బ్యానర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బొమ్మ కూడా ఉంది.

ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలన్ని మళ్లీ ఆప్‌నకే పట్టం కట్టగా.. ఫలితాలు వాటిని నిజం చేస్తున్నాయి. ప్రజల నాడిని విశ్లేషించటంలో సర్వే సంస్థలు సఫలీకృతం అయినట్లు కన్పిస్తోంది. ప్రస్తుతం ఆప్‌ 56 సీట్లలో ముందజలో ఉండగా, బీజేపీ 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌ ఒక్క చోట కూడా ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం. ప్రధాని మోదీతోపాటు, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ లాభం లేపోయింది. ఢిల్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలను అమిత్‌ షా చేపట్టిన విషయం తెలిసిందే.
ఇక్కడ చదవండి: హస్తిన తీర్పు : ఖాతా తెరవని కాంగ్రెస్‌

మరిన్ని వార్తలు