'ఆప్' గుర్రాలపై బుకీల బెట్టింగ్ జోరు!

27 Mar, 2014 12:34 IST|Sakshi
'ఆప్' గుర్రాలపై బుకీల బెట్టింగ్ జోరు!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అందర్ని ఆశ్చర్యకరమైన ఫలితాలను సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని బుకీలు హాట్ ఫేవరేట్ గా భావిస్తున్నారు. రానున్న లోకసభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల 'జాదూ'ను ఆప్ రిపీట్ చేయవచ్చనే అంచనాతో దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని పార్లమెంట్ స్థానాలపై అధిక ఆసక్తిని బుకీలు చూపుతున్నట్టు సమాచారం. ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఓటములపై ఇంకా బెట్టింగ్ ప్రారంభం కానప్పటికి.. బుకీలు ఎక్కువగా ఆమ్ ఆద్మీపార్టీపైనే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. 
 
ఏప్రిల్ 7 నుంచి మే 12 తేది వరకు జరిగే సాధారణ ఎన్నికల్లో దేశమంతటా ఎక్కువ సంఖ్యలోనే ఆమ్ ఆద్మీ పార్టీ స్థానాలు గెలిచే అవకాశముందని బుకీలు అంచనా వేస్తున్నారు. వారణాసిలో నరేంద్ర మోడీ, కేజ్రివాల్ ల మధ్య భీకర పోరు సాగే అవకాశం ఉండటంతో బుకీలు పుణ్యక్షేత్రంపై దృష్టిని కేంద్రికరిస్తున్నారు. ఇంకా చంఢీఘడ్ లోకసభ స్థానంలో ఆప్ అభ్యర్థి గుల్ పనాగ్, బీజేపీ నుంచి కిరణ్ ఖేర్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పవన్ కుమార్ భన్సాల్ ల మధ్య త్రిముఖ పోటి రసవత్తరంగా మారడంతో ఆస్థానంపై బుకీలు కన్నేస్తున్నారు. ఇంకా నందన్ నీలెకని పోటీ చేసే బెంగళూరులోనూ, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని స్థానాల్లోను బెట్టింగ్ భారీగా జరిగే అవకాశముందంటున్నారు. 
 
బుకీలో దృష్టిలోఉన్న స్థానాల్లో అజయ్ మాకెన్ పోటి చేస్తున్న న్యూఢిల్లీ, అమేథి, న్యూఢిల్లీ, చాందీని చౌక్, ఘజియాబాద్ స్థానాలపై బెట్టింగ్ జోరు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫేవరెట్ స్థానం అంటే ఎలాంటి సందేహాం లేకుండా గెలిచే స్థానంపై బుకీలు తక్కువ మొత్తాన్ని ఇచ్చే విధంగా నిర్ణయిస్తారు.  గత ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగతుందనే అంచనాతో ఆపార్టీపై 2.25 పైసలు, కాంగ్రెస్ పై 2.40 పైసలు, ఆమ్ ఆద్మీ పార్టీపై 3.40 పైసలు బెట్టింగ్ జరిగింది. ఒకవేళ పంటర్ 1 లక్ష రూపాయలు బీజేపీపై పెట్టుబడి పెడితే  2.25 లక్షలు, ఆమ్ ఆద్మీ పార్టీపై పెడితే  3.40 లక్షలు సొంత చేసుకుంటారన్న మాట. రానున్న ఎన్నికల్లో బెట్టింగ్ విలువను ఇంకా నిర్ఱారించలేదని పేరు తెలుపడానికి ఇష్టపడని బుకీ ఒకరు తెలిపారు. 
 
ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో బెట్టింగ్ జోరు కొనసాగవచ్చనే వార్తలతో పోలీసు యంత్రాంగం బెట్టింగ్ వీరులను కట్టడి చేసేందుకు ఇప్పటి నుంచి ప్రయత్నాలను ప్రారంభించింది. బెట్టింగ్ పాల్పడితే ఐపీసీ 420 సెక్షన్ ప్రకారం శిక్షార్హులని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసుతో ఏడు ఏళ్ల వరకు శిక్ష పడవచ్చని పోలీసులు తెలిపారు. 
మరిన్ని వార్తలు