బీఎస్‌పీ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి

6 Feb, 2020 11:48 IST|Sakshi

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీతో పాటు ఇతర పార్టీలు పోటాపోటీగా పాల్గొంటున్నాయి. అదేవిధంగా ప్రచారంలో ఆప్‌, బీజేపీ చేసే విమర్శలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో బాదర్పూర్ నియోజకర్గం బీఎస్‌పీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ్ దత్ శర్మపై బుధవారం దాడి జరిగింది. ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి జరగటం ఢిల్లీలో చర్చనీయ అంశంగా మారింది.

నారయణ్‌ దత్‌ శర్మ తన కారులో పార్టీ మీటింగ్‌కు హాజరై తిరిగి వస్తుండగా పదిమంది గుర్తు తెలియని దుండగులు ఆయనపై దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కారు అద్దాలు పగిలి మీద పడటంతో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ దత్‌.. తన రాజకీయ ప్రత్యర్థులు ఈ దాడి చేయించారని ఆరోపించారు. కాగా, ఇటీవల ఆయన ఆప్‌ నుంచి బయటకు వచ్చి బీఎస్‌పీలో చేరిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో​ బాదర్పూర్ నియోజకవర్గంలో ఆప్‌ ఆయనకు టికెట్‌ నిరాకరిచంటంతో బీఎస్‌పీలో చేరినట్లు తెలుస్తోంది. 
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా