కేజ్రీవాల్‌ సలహాదారు రాజీనామా

13 Mar, 2018 13:23 IST|Sakshi
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు షాక్‌ తగిలింది. ఆయన వ్యక్తిగత సలహాదారుడు వీకే జైన్‌ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఉదయం జైన్‌ తన రాజీనామా లేఖను సీఎంవో కార్యాలయానికి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయానికి పంపారు.

వ్యక్తిగత కారణాల వల్ల తన పదవి నుంచి వైదోలుగుతున్నట్లు తన రాజీనామ లేఖలో పేర్కోన్నారు. అయితే ఢిల్లీ చీఫ్‌ సెక్రటరీ అన్షు ప్రకాశ్‌పై దాడి కేసులో జైన్‌ సాక్షి ఉండటంతో ఆయన రాజీనామా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు రెండురోజుల క్రితమే జైన్‌ను సీఎస్‌ దాడి వ్యవహారంలో  పోలీసులు  విచారించారు కూడా. 

కాగా, గతనెల 22వ తేదీన ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ అన్షు పై ఆప్‌ ఎమ్మెల్యేలు అమానుతుల్లా ఖాన్‌, ప్రకాశ్‌ జార్వల్‌ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని.. ఎమెల్యేలు దాడి చేయటం చూశానని విచారణలో జైన్‌ తెలిపారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి సీఎం కార్యాలయానికి దూరంగా ఉంటున్న జైన్‌.. హఠాత్తుగా రాజీనామా చేయటం విశేషం. ఇప్పటికే వరుస ఆరోపణలతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న కేజ్రీవాల్‌కు.. ఇప్పుడు జైన్‌ రాజీనామా దిగ్భ్రాంతికి కలిగించేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

మరిన్ని వార్తలు