ఇప్పటివరకూ ఢిల్లీ సుల్తానులు

10 Feb, 2015 14:23 IST|Sakshi
ఇప్పటివరకూ ఢిల్లీ సుల్తానులు

న్యూఢిల్లీ: ఢిల్లీ విస్తీర్ణం ఒక వేయి 484 చదరపు కిలో మీటర్లు. ఢిల్లీ రాజకీయ చరిత్రను ఓసారి చూస్తే.. ఇప్పటి వరకు ఏడుగురు ముఖ్యమంత్రులు పనిచేశారు.  ఢిల్లీకి తొలి సీఎం చౌదరి బ్రహ్మ ప్రకాశ్‌. 1952లో ఐఎన్‌సి తరఫున ఆయన సీఎంగా ఎన్నికయ్యారు. హస్తినను పాలించిన సీఎంలలో పిన్న వయస్కులు బ్రహ్మ ప్రకాశ్‌.

ఢిల్లీ సీఎం పగ్గాలు చేపట్టేనాటికి బ్రహ్మ ప్రకాశ్ వయస్సు 34 సంవత్సరాలు. 1956లో ఓసారి.. 2014లో ఓసారి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించారు. దాదాపు 37 ఏళ్లు పాటు ఢిల్లీకి సీఎం లేరు. 1956 నుంచి 1993 వరకు సీఎం లేకుండానే ఢిల్లీలో పాలన సాగింది. ఢిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి.

ఇంతవరకు ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన వారు..
1.చౌధునీ బ్రహ్మ ప్రకాశ్ 1952-55
2.గురుముఖ్ నీహాల్ సింగ్ 1955-56
3.మదన్ లాల్ ఖురానా 1993-96
4.సాహిబ్ సింగ్ వర్మ 1996-98
5. సుష్మా స్వరాజ్ 1998-98 (52 రోజులు)
6.షీలా దీక్షిత్ 1998-2013
7.అరవింద్ కేజ్రీవాల్ 2013-2014 (49 రోజులు)
8.అరవింద్ కేజ్రీవాల్ 2015 నుంచి

ఎవరెన్ని రోజులు ?
కేవలం 49 రోజులే కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా కొనసాగారు. ఆయన తర్వాత స్థానం సుష్మా స్వరాజ్‌ది. ఆమె 52రోజులు ఢిల్లీ సీఎంగా ఉన్నారు. పార్టీ ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వాన్ని స్థాపించిన పొలిటికల్ పార్టీగా ఆమ్‌ ఆద్మీ రికార్డు స్థాపించింది. 2012 నవంబర్‌లో ఆప్‌ ఆవిర్భవించగా.. 2013 డిసెంబర్‌లో ఢిల్లీలో అధికార పగ్గాలు చేపట్టింది.

మరిన్ని వార్తలు