రాబర్ట్‌ వాద్రా బెయిల్‌ పొడిగింపు

29 Mar, 2019 08:42 IST|Sakshi
రాహుల్‌ గాంధీ, రాబర్ట్‌ వాద్రా (ఫైల్‌)

న్యూఢిల్లీ: లండన్‌లో ఆస్తుల కొనుగోలు కేసులో నగదు అక్రమ రవాణాకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బావ రాబర్ట్‌ వాద్రా తాత్కాలిక బెయిల్‌ను ఢిల్లీ కోర్టు గురువారం పొడిగించింది. ఈ కేసులో ఇప్పటికే మార్చి 27 వరకు రాబర్ట్‌ వాద్రాకు తాత్కాలిక బెయిల్‌ ఇచ్చిన ఢిల్లీ కోర్టు తాజాగా ఏప్రిల్‌ 1వ తేదీ వరకు బెయిల్‌ పొడిగింపునకు అనుమతిని ఇచ్చింది. అప్పటివరకు వాద్రాను అరెస్ట్‌ చేయరాదని దర్యాప్తు సంస్థకు ఈ సందర్భంగా కోర్టు సూచించింది.

గురువారం ఈ కేసులో వాదనలు జరిగాయి. ఇంటరాగేషన్‌ కోసం రాబర్ట్‌ వాద్రాను అప్పగించాలని ప్రత్యేక న్యాయమూర్తి అర్వింద్‌ కుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కోరింది. అయితే వాద్రా తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది కేటీఎస్‌ తులసి వాదనలు వినిపిస్తూ, వాద్రాపై వచ్చినవి నిరాధార ఆరోపణలని, కోర్టు మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్‌ను ఆయన దుర్వినియోగం చేయలేదని న్యాయమూర్తికి వివరించారు.

మరిన్ని వార్తలు