నిర్భయ దోషులకు కొత్త డెత్‌వారెంట్లు జారీ

17 Jan, 2020 17:05 IST|Sakshi

ఉరిశిక్ష తేదీల్లో మార్పులు

సాక్షి, న్యూఢిల్లీ : దేశమంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న నిర్భయ దోషుల ఉరిశిక్ష తేదీలను ఢిల్లీకోర్టు ఖరారు చేసింది. గతంలో ప్రకటించిన తేదీ కాకుండా మరోసారి డెత్‌ వారెంట్లు జారీచేసింది. నలుగురు దోషులకు ఫిబ్రవరి 1 ఉదయం 6గంటలకు (శనివారం) ఉరిశిక్ష అమలు చేయాల్సిందిగా పటియాల హౌస్‌కోర్టు శుక్రవారం తీహార్‌ జైలు అధికారులను ఆదేశించింది. కాగా జనవరి 22న దోషులను ఉరి తీసేందుకు జైలు అధికారులు ఇదివరకే  ఏర్పాట్లు పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే హత్య కేసులో దోషి ముఖేశ్‌ సింగ్ క్షమాభిక్ష పెట్టుకున్నారు. ఈ పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం తిరస్కరించారు. కాగా ఉరిశిక్ష అమలు ఆలస్యంపై నిర్భయ తల్లితో పాటు పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో న్యాయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఉరితీత తేదీల్లో మార్పులు చేస్తూ.. తాజాగా డెత్‌వారెంట్లను జారీచేశారు.

మరిన్ని వార్తలు