జిందాల్‌పై అభియోగాలు నమోదుచేయండి

2 Jul, 2019 04:03 IST|Sakshi
నవీన్‌ జిందాల్

దర్యాప్తు సంస్థకు ఢిల్లీకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణానికి సంబంధించిన కేసులో పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్, మరో నలుగురిపై అభియోగాలు నమోదు చేయాలని ప్రత్యేక కోర్టు సోమవారం దర్యాప్తు సంస్థను ఆదేశించింది. జిందాల్‌తో పాటు మరో నలుగురిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 420 (చీటింగ్‌), 120–బి (క్రిమినల్‌ కుట్ర) కింద అభియోగాలు మోపాలని ప్రత్యేక న్యాయమూర్తి భరత్‌ పరాషర్‌ ఆదేశించారు. జిందాల్‌తోపాటు, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ మాజీ డైరెక్టర్‌ సుశీల్‌ మరూ, మాజీ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ గోయల్, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ విక్రాంత్‌ గుజ్రాల్, కంపెనీ అధీకృత ఉద్యోగి డీఎన్‌ అబ్రోల్‌పై అభియోగాలు మోపారు. మధ్యప్రదేశ్‌లోని బొగ్గు బ్లాకుల కేటాయింపునకు సంబంధించిన విషయాన్ని కోర్టు విచారించింది. నిందితులపై అభియోగాలను అధికారికంగా ప్రకటించేందుకు జూలై 25 వరకు సమయం ఇచ్చింది.

మరిన్ని వార్తలు