చైనాకు అక్ర‌మంగా మాస్కులు, పీపీఈ కిట్లు

14 May, 2020 11:30 IST|Sakshi

ఢిల్లీ : చైనాకు పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజ‌ర్ల‌ను  అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న ముఠాను క‌స్ట‌మ్స్ అధికారులు ఢిల్లీలో ప‌ట్టుకున్నారు. 5 లక్ష‌ల మాస్కులు, 952 పీపీఈ కిట్లు, 57 లీట‌ర్ల శానిటైజ‌ర్ల‌ను ముఠా అక్ర‌మంగా చైనాకు త‌ర‌లిస్తున్నట్లు ఇంటలిజెన్స్ అందించిన స‌మాచారంతో ఢిల్లీలో అరెస్ట్ అదుపులోకి తీసుకున్నారు. భార‌త్‌లో రోజురోజుకు పెరుగుతున్న క‌రోనా కేసుల నేప‌థ్యంలో వీటి వినియోగం బాగా పెరిగింది.

దీంతో వెంటిలేట‌ర్లు, మాస్కులు వంటి ర‌క్ష‌ణ వ‌స్తు సామాగ్రి ఎగుమ‌తిని ఇత‌ర దేశాల‌కు నిషేదిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) మార్చి 19న  ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అంతేకాకుండా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ ఎగుమతిని ఏప్రిల్ 7న డీజీఎఫ్‌టీ నిషేధించింది. ఈ నేప‌థ్యంలో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (మద్యాన్ని తరలిస్తున్న ఎమ్మెల్యే.. కారు సీజ్‌!)

మరిన్ని వార్తలు