400 మందికి ఢిల్లీ నివాసులుగా నకిలీ గుర్తింపు!

29 Aug, 2019 19:26 IST|Sakshi

న్యూఢిల్లీ : బస్సుల్లో భద్రత కోసం ఢిల్లీ ప్రభుత్వం పౌర రక్షణ వాలంటీర్లను(సివిల్‌ డిఫెన్స్‌ వాలంటీర్స్‌) నియమించాలని నిర్ణయించుకుంది. ఈ కొలువులు కేవలం స్థానికులకే అని తెలిపింది. ఈ నేపథ్యంలో ఓ జిల్లా మేజిస్ట్రేట్‌  ఆఫీసర్‌  కొంత మందికి నకీలి ధృవీకరణ పత్రాలను జారీ చేశారు. షాహదార జిల్లా మేజిస్ట్రేట్‌ కుల్దీప్ పకాడ్ దాదాపు నాలుగు వందల మందికి పైగా నకిలీ ధృవీకరణ పత్రాలను జారీ చేసినట్లు తెలిసింది. వీరిలో అత్యధికంగా కుల్దీప్‌ సొంత రాష్ట్రం వారే ఉండటం గమనార్మం. తన రాష్ట్రానికి చెందిన పలువురుకి, ఢిల్లీ నివాసితులుగా గుర్తింపునిస్తూ కుల్దీప్‌ పత్రాలను జారీ చేసినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్‌ గహ్లోట్‌ ఈ కేసులో నిజానిజాలను తేల్చేందుకు విచారణకు ఆదేశించారు.

ఈ సందర్భంగా కైలాష్‌ మాట్లాడుతూ.. ‘అధికారిపై వచ్చిన ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. నిజానిజాలు తేల్చేందుకు ఓ కమిటీని వేసింది. రెండు రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. నివేదిక ఆధారంగా కుల్దీప్‌పై చర్యలు తీసుకుంటాము’ అని తెలిపారు. అంతేకాక విచారణ పూర్తయ్యేవరకు షాహదార జిల్లాలో సివిల్‌ డిఫెన్స్‌ వాలంటీర్ల ప్రక్రియను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఢిల్లీ ప్రభుత్వం ఇటివల బస్సుల్లో పౌర రక్షణ వాలంటీర్లను నియమించాలని జిల్లా డీఎంలను ​ఆదేశించింది. అన్ని జిల్లాలను కలుపుకోని రవాణా శాఖలో మొత్తం పది వేల మార్షల్‌  సివిల్‌ డిఫెన్స్‌ వాలంటీర్స్‌ కొలువులు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు