చనిపోతున్నా.. నా అవయవాలు దానం చేయండి!

12 May, 2016 19:28 IST|Sakshi
చనిపోతున్నా.. నా అవయవాలు దానం చేయండి!

రీమా డాక్టర్‌ కావాలనుకుంది. ఆ కలతోనే ఎంబీబీఎస్ పరీక్షలు కూడా రాసింది. కానీ, పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఢిల్లీలోని మోరిస్ నగర్‌లో గురువారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. డాక్టర్ కావాలనుకున్న 17 ఏళ్ల రీమా సూద్‌ చనిపోయాక తన అవయవాలను దానం చేయాలని కోరుతూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది.

మంగళవారం వచ్చిన పరీక్షల ఫలితాల్లో తాను కెమిస్ట్రీ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో మానసిక క్షోభకు గురైన ఆమె తన కుటుంబసభ్యులకు లేఖ రాసి తనువు చాలించింది. తను మంచి కూతురిని, విద్యార్థినిని కాలేకపోయినందుకు క్షమించాలని తల్లిదండ్రుల్ని ఆ లేఖలో కోరింది. అయితే, పరీక్షల్లో ఫెయిలయ్యామన్న చిన్నచిన్న కారణాలతోనే విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు