కేంద్ర‍ం ప్రకటనపై ఢిల్లీ సర్కార్‌ అసంతృప్తి

25 Apr, 2020 11:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన సడలింపులపై ఢిల్లీ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓ వైపు కరోనా వ్యాప్తి చెందుతుంటే ఆంక్షలు సడలిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం సరైనదికాదని అభిప్రాయపడింది. ఢిల్లీలో వైరస్‌ వ్యాప్తి ఇంకా అదుపులోకి రానందున దుకాణాలను తెరిచే ప్రసక్తేలేదని స్పష్టం చేసింది. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను విపత్తు నిర్వహణ సంస్థ పరిశీలించిన అనంతరం సడలింపులపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.(మరికొన్ని ఆంక్షలు సడలింపు)

ఈ మేరకు ఓ సీనియర్‌ అధికారి లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుపై స్పందించారు. సడలింపులపై ఏప్రిల్‌ 27న సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా దేశ రాజధానిలో కరోనా పాజటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇపట్పి  వరకు కేసుల సంఖ్య  2,514కి చేరింది. కాగా నాన్‌ హాట్‌స్పాట్‌ ఏరియాలోని మున్సిపాలిటీ పరిధిలో గల దుకాణాలను తెరవబడతాయని కేంద్ర ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్‌పై మరికొంతకాలం పాటు ఆంక్షలు కొనసాగనున్నాయి.

>
మరిన్ని వార్తలు