మూడో విడత ఫ్యాన్సీ నెంబర్ల వేలం

19 Dec, 2014 23:59 IST|Sakshi
మూడో విడత ఫ్యాన్సీ నెంబర్ల వేలం

* నేటి నుంచి ప్రారంభం.. నెలాఖరు వరకు గడువు
* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈ వేలంలో పేరు నమోదు

న్యూఢిల్లీ : ఫ్యాన్సీ నెంబర్లు అవసరం ఉన్న వాహనదారులకు మరో అవకాశం లభించింది.  ఫ్యాన్సీ నెంబర్ల కోసం మొదటి, రెండు దఫాల్లో నిర్వహించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో నెంబర్లు తీసుకోని వారికి ప్రభుత్వం మూడో విడత అవకాశాన్ని కల్పించింది. ఈ సారి  ఈ -వేలం విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ తెలిపిన వివరాల ప్రకారం. 0001 రిజిస్ట్రేషన్ నెంబర్ అత్యంత ఆదరణ ఉంది. దీనికి రూ. 5లక్షలుగా ఫిక్స్‌డ్‌గా నిర్ణయించారు. రెండో ప్రాధాన్యతా నెంబర్ 0002-0009 రూ. ప్రారంభ ధర రూ. 3 లక్షలు, మూడో కేటగిరిలో 0010 నుంచి 009, 0786, 1000, 1111, 7777, 999 దీని ధరను రూ. 2 లక్షలుగా నిర్ణయించిన రవాణాశాఖాధికారులు పేర్కొన్నారు.

ఈ వేలం ద్వారా నెంబర్లను కేటాయించే విధానం డిసెంబర్ 30 వరకు కొనసాగుతోంది. మూడో విడతలో 140 ఫ్యాన్సీ నెంబర్లను కేటాయించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నామని చెప్పారు. ఈ నెంబర్లను కావల్సి వాహనదారులు ‘ఆన్‌లైన్’లో రిజిస్ట్రేషన్ చేయించుకొని వేలంలో పాల్గొనవచ్చు. ఇంతకు ముందు నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో అత్యధికంగా 0001ను వాహనదారులు సొంత చేసుకొన్నారు. ఇందుకు రూ. 12.5ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. మొత్తం ఫ్యాన్సీ నెంబర్లకు రూ. 74 లక్షల ఆధాయం వచ్చింది. రెండో విడత నిర్వహించిన కార్యక్రమంలో రెండో కేటగిరికి చెందిన ఫ్యాన్సీ నెంబర్‌కు రూ. 7.5 లక్షల ఆదాయం వచ్చిందని సంబధిత అధికారి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు