సంతోషం కోసం ఓ పిరియడ్‌!

3 Jul, 2018 03:21 IST|Sakshi

న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థుల కోసం ‘హ్యాపీనెస్‌ కరిక్యులమ్‌’ (కొత్త తరహా సిలబస్‌)ను ఢిల్లీ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. దీన్ని ఢిల్లీ సీఎం  కేజ్రీవాల్, ఆధ్యాత్మిక గురువు దలైలామా సంయుక్తంగా సోమవారం ప్రారంభించారు. ఈ సిలబస్‌పై ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీశ్‌ సిసోడియా మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి వరకు ఈ ‘హ్యాపీనెస్‌’ పిరియడ్‌ 45 నిమిషాలపాటు ఉండనుంది. ‘ధ్యానంతో పాటు విలువైన విద్య, మానసిక వ్యాయామాలు ఉంటాయి. 40 మంది ప్రభుత్వ స్కూళ్ల టీచర్లు, విద్యావేత్తలు అధ్యయనం చేసి దీన్ని రూపొందించారు. తీవ్రవాదం, అవినీతి, కాలుష్యంలాంటి అధునిక సమస్యలను ఇలాంటి మానవీయ విద్యను అందించడం ద్వారా పరిష్కరించవచ్చని ఆశిస్తున్నాం’ అని సిసోడియా చెప్పారు. ఆధునిక విద్య, ప్రాచీన జ్ఞానం ఏకం చేయడంతో ప్రతికూల భావాల్ని అధిగమించగల్గుతామని దలైలామా అన్నారు.

మరిన్ని వార్తలు