వందేమాతరంకు సమాన హోదా ఇవ్వలేం

26 Jul, 2019 14:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ గీతం ‘జనగణమన’తో పాటుగా ‘వందేమాతరం’ గేయానికి కూడా సమాన హోదా ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. జాతీయ గీతం, జాతీయ గేయాలకు మరింత ప్రచారం కల్పించే విధంగా జాతీయ విధానాన్ని తీసుకురావాలంటూ కేంద్రాన్ని ఆదేశించాలని కూడా ఉపాధ్యాయ్ తన పిటిషన్‌లో కోరారు. అన్ని పాఠశాలల్లోనూ ఈ రెండు గీతాలను ఆలపించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించాలంటూ పిటిషనర్ హైకోర్టుకు విన్నవించారు. దీనికి ధర్మాసనం నిరాకరిస్తూ.. పిటిషన్‌ను తొసిపుచ్చింది.
 
కాగా జాతీయ గీతంతో పాటు జాతీయ గేయాన్ని కూడా సమానంగా గౌరవించాలంటూ 2017లో ఢిల్లీ హైకోర్టులో ఇదే తరహా పిటిషన్ దాఖలయిన విషయం తెలిసిందే. అయితే భారతీయుల మదిలో ‘వందే మాతరం’ గేయానికి ప్రత్యేక స్థానం ఉందంటూ కేంద్రం ఈ పిటిషన్‌ను వ్యతిరేకించింది. ‘జన గణ మన’తో సమానంగా దీన్ని పరిగణించలేమని తేల్చిచెప్పింది. దీంతో ఢిల్లీ కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. 
 

మరిన్ని వార్తలు