‘నేషనల్‌ హెరాల్డ్‌’ ఖాళీ చేయాల్సిందే..!

28 Feb, 2019 12:47 IST|Sakshi

తేల్చి చెప్పిన ఢిల్లీ హైకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్‌ హెరాల్డ్‌ వార్తా సంస్థకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సెంట్రల్‌ ఢిల్లీలోని ఆఫీస్‌ను ఖాళీ చేయాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు డిసెంబరులో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ అసోషియేట్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం కొట్టివేసింది. దేశ రాజధాని ప్రాంతంలో గల ఢిలీ-ఐటీవో భవనంలో హెరాల్డ్‌ సంస్థ గత 56 ఏళ్లుగా కొనసాగుతోంది.

కాగా, ఐటీవో ప్రాంతంలో ఎలాంటి వార్తా సంస్థలు కొనసాగరాదంటూ కేంద్రం గతంలోనే కోర్టుకు విన్నవించింది. గత పదేళ్లుగా ఐటీవో ప్రాంతంలో వార్తా సంస్థల నిర్వహణకు అనుమతివ్వడం లేదని తెలిపింది. 56 ఏళ్ల క్రితం అసోషియేట్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌కు ఇచ్చిన లీజును ఈ మేరకు కేంద్రం రద్దు చేసింది. దీంతో ఐటీవో భవనంలో కొనసాగుతున్న నేషనల్‌ హెరాల్డ్‌ ఆఫీస్‌ను ఖాళీ చేయాలని డిసెంబరులో కోర్టు ఉత్తర్వులిచ్చింది. 

మరిన్ని వార్తలు