లాలూకు మరో షాక్‌

17 Sep, 2018 21:20 IST|Sakshi

లాలూ, రబ్రీ, తేజస్వీలకు సమన్లు జారీ చేసిన ఢిల్లీ కోర్టు

సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌ మాజీ సీఎం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబానికి మరో షాక్‌ తగిలింది. ఐఆర్‌సీటీసీ మని లాండరింగ్‌ కేసులో లాలూ ప్రసాద్‌, ఆయన సతీమణి రబ్రీదేవి, కుమారుడు తేజస్వీ యాదవ్‌లకు ఢిల్లీ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. ఈ కేసులో నిందితులను అక్టోబర్‌ ఆరులోపు తన ముందు హాజరుకావల్సిందిగా కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం లాలూ రాంచీ జైల్లో శిక్ష అనుభవిస్తున్నందున  ఆయనకు ప్రొడక్షన్‌ వారెంట్‌ను జారీ చేసింది.

సుజాత ప్రైవేటు లిమిటెడ్‌ హోటల్‌కు రెండు రైల్వే హోటళ్లను సబ్‌ లీజ్‌ను ఇచ్చే విషయంలో లాలూతో సహా అధికారులు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఈడీ ఆభియోగాలు యోపింది. దీనిపై గతంలో ఈడీ చార్జ్‌షీట్‌ను నమోదు చేయగా.. కేసుపై విచారించడానికి తగిన సమయం కావాల్సిందిగా ఈడీని కోర్టు కోరింది. ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై పూర్తి విచారణ అనంతరం కోర్టు వారికి సమన్లు జారీ చేసింది. ఇప్పటికే పలు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న లాలూకు మరోసారి సమన్లు రావడంతో ఆర్జేడీ వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.

>
మరిన్ని వార్తలు