భక్తులకు రైల్వే శాఖ శుభవార్త ...

18 Sep, 2019 16:09 IST|Sakshi

ఢిల్లీ : కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త.  ఢిల్లీ నుంచి కాట్రా వరకు ప్రయాణించే రెండవ వందే-భారత్‌ రైలును ప్రారంభించనుంది. దసరా నవరాత్రి ఉత్సవాల రోజుల్లో ఇది ప్రారంభం కానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే భారత్‌ మొదటి సెమీ హై స్పీడ్‌ రైలు వందే భారత్‌ ఢిల్లీ-వారణాసీ మధ్య నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ రైలు విజయవంతంగా నడుస్తుండటంతో ఇటీవలే భారత రైల్వే మరో 40 నూతన వందే-భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో దేవి నవరాత్రుల్లో వైష్ణో దేవి  పవిత్ర దేవాలయాన్ని సందర్శించే లక్షలాది యాత్రికులకు అనుకూలంగా ఉండే ఢిల్లీ-కాట్రా వందే భారత్‌ రైలును నవరాత్రి రోజుల్లో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని పీయూష్‌ గోయల్‌ తన ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. 

భారత రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా ట్రయల్ రన్ కింద ఢిల్లీ-కాట్రా వందే-భారత్‌ రైలుకు సంబంధించిన ట్రయల్‌ రన్‌ ఇప్పటికే విజయవంతంగా పూర్తి అయిందనీ, ఇది వైష్ణో దేవి యాత్రికులకు శుభవార్త అని పేర్కొన్నారు.  ఈ రైలు ఢిల్లీ జంక్షన్‌ నుంచి ఉదయం 6 గంటలకు ప్రారంభమై అంబాలా, లుధియానా, జమ్మూతావి మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు కాట్రాకు చేరుకోనుంది. 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ రైలు.. కాట్రాకు 8 గంటల్లో చేరుకోనుందన్నమాట. 

అలాగే  రద్దీగా ఉండే  పలు రైల్వే మార్గాలను సరళీకృతం చేయడానికి ప్రయత్రిస్తున్నట్లు వినోద్‌ కుమార్‌ తెలిపారు. ఢిల్లీ-ముంబై, ఢిల్లీ- హౌరా రైళ్లు 2021 నాటికి సిద్ధమవుతాయన్నారు. ఇక నూతనంగా ప్రారంభించబోతున్న 40 వందే-భారత్‌ రైళ్ల గురించి మాట్లాడుతూ..వీటి టెండర్‌ విషయంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాజాగా పూర్తి పారదర్శకతతో కొత్త టెండరింగ్‌ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ రైళ్లు పూర్తి భారతీయ సాంకేతికతతో తయారు అవుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీ-కాట్రా రైలు ఢిల్లీ జంక్షన్‌ నుంచి ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యి అంబాలా, లుధియానా, జమ్మూతావి మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు కాట్రాకు చేరుకోనుంది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ల్యాండర్‌ విక్రమ్‌ కోసం ‘పైకి’ చేరాడు..!!

ఎలా ఉన్నారు? 

‘సింధూ నాగరికత’ వారసులు తమిళులా!

కేంద్రం కీలక నిర్ణయం: ఈ-సిగరెట్లపై నిషేధం

రైల్వే ఉద్యోగులకు బోనస్‌ బొనాంజా

‘సిట్‌ ఆయనను రక్షించాలని చూస్తోందా?’

ఆ కుటుంబం వల్ల ఊరికి ప్రత్యేక గుర్తింపు

తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని..

హిందీపై అమిత్‌ షా వర్సెస్‌ రజనీకాంత్‌

అయోధ్య కేసు : అక్టోబర్‌ 18లోగా వాదనలు పూర్తి

అవమానించిందని ప్రిన్సిపల్‌ను చంపేశాడు..!

ప్రధానికి విషెస్‌; సీఎం భార్యపై విమర్శలు!

షాకింగ్‌: పార్కుల్లో అమ్మాయిలను చూసి.. 

ప్రశాంతత కోసం ఇంట్లో చెప్పకుండా..

పీవోకే భారత్‌దే.. పాక్‌ తీవ్ర స్పందన

హెల్మెట్‌ లేకున్నా.. ఒక్క రూపాయి కట్టలేదు..!

పాక్‌ దుస్సాహసాన్ని తిప్పికొట్టిన భారత సైన్యం

ఆందోళనలో ఆ నలుగురు ఎంపీలు!

ఈ-సిగరెట్స్‌పై నిషేధం..

ఇకపై ‘చుక్‌.. చుక్‌’ ఉండదు!

సినీ ఫక్కీలో కిడ్నాప్‌

ఈపీఎఫ్‌ వడ్డీరేటు 8.65 శాతం

మోదీ కలశానికి రూ. కోటి

పీవోకే భారత్‌లో భాగమే 

హస్తం గూటికి బీఎస్పీ ఎమ్మెల్యేలు

శివకుమార్‌ కస్టడీ పొడిగించిన కోర్టు

ప్రధాని భార్యను పలకరించిన మమత

పటేల్‌ స్ఫూర్తితోనే ‘370’ రద్దు

అస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శివజ్యోతిని ఎమోషనల్‌గా ఆడుకుంటున్నారా?

ఆ బాలీవుడ్‌ దర్శకుడు ఇక లేరు

బిగ్‌బాస్‌: రీఎంట్రీ లేనట్టేనా..!

విశాఖలో నా ఫ్యాన్స్‌ ఎక్కువ

మైకం కమ్మినంత పనైంది: కాజల్‌

నా అభిమానుల జోలికి రావద్దు: స్టార్‌ హీరో