రోహిత్‌ టాండన్ అరెస్ట్‌

29 Dec, 2016 09:43 IST|Sakshi
రోహిత్‌ టాండన్ అరెస్ట్‌

న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్‌ కేసులో ఢిల్లీ లాయర్‌ రోహిత్‌ టాండన్‌ అరెస్టయ్యారు. ఆయనను ఎన్‌ ఫోర్స్ మెంట్‌  డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. దాదాపు రూ. 70 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్టు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతవారం కోల్‌ కతాలో అరెస్టు చేసిన ప్రముఖ వ్యాపారవేత్త పర్సామల్‌ లోధాతో టాండన్‌ కు సంబంధాలున్నట్టు తెలుస్తోంది.

ఈ నెల 10న టాండన్‌ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు జరిపి రూ. 14 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ. 2.2 కోట్ల విలువ చేసే రెండువేల రూపాయల నోట్లు ఉన్నాయి. తన ఇంట్లో దాడి జరుగుతున్న విషయాన్ని సీసీటీవీ కెమెరాల సాయంతో తన మొబైల్ ఫోన్లో చూసి, అటునుంచి అటే ఆయన అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు. పదిరోజుల తర్వాత అధికారులకు చిక్కారు. ఆయనను కోర్టులో హాజరు పరచనున్నారు.

చదవండి: (ఆ డబ్బును.. మూడు కార్లలో తరలించారు!)

మరిన్ని వార్తలు