ప్రతిపక్ష నేతగా కమల్‌నాథ్!

24 May, 2014 01:02 IST|Sakshi
ప్రతిపక్ష నేతగా కమల్‌నాథ్!

న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ ఎంపీ అయిన కమల్‌నాథ్‌ను నియమించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎంపీగా సీనియారిటీ ప్రకారం చూస్తే..  ఆయననే ఆ పదవి వరించే అవకాశాలున్నాయన్నాయి. అయితే, మిగతా అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పార్టీ పార్లమెంటరీ పక్ష నేత ఈ విషయంలో ఒక నిర్ణయానికి వస్తారని తెలిపాయి.

లోక్‌సభలో కమల్‌నాథ్ కాకుండా లోక్‌జనశక్తి పార్టీకి చెందిన రామ్ విలాస్ పాశ్వాన్, నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన పీఏ సంగ్మాలు అత్యంత సీనియర్ సభ్యులు. కనీసం 55 స్థానాల్లో విజయం సాధిస్తేనే నిబంధనల ప్రకారం ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా లభిస్తుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 44 స్థానాల్లోనే గెలుపొందింది. అయితే, ఏ పార్టీకైనా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడమనేది స్పీకర్ విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది.
 
 

>
మరిన్ని వార్తలు