స్నేహితుడిని చంపి.. ఆ తర్వాత భార్యను..

26 Jun, 2019 12:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ :  స్నేహితుడి భార్యపై కన్నేసిన ఓ వ్యక్తి అడ్డుగా ఉన్న భర్తను దారుణంగా హతమార్చాడు. అనంతరం తనకు ఏ పాపం తెలియదు అన్నట్లుగా పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో నేరం అంగీకరించి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు.. దల్బీర్‌(30), గుల్ఖేశ్‌ ఇద్దరు స్నేహితులు. తరచుగా ఒకరి ఇళ్లకు ఇంకొకరు వెళ్లేవారు. ఈ క్రమంలో దల్బీర్‌ భార్యతో గుల్ఖేశ్‌కు పరిచయం ఏర్పడి...అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమెను వేధించసాగాడు.

కానీ ఆమె ఇందుకు నిరాకరించడంతో స్నేహితుడి అడ్డు తొలగించుకుంటే ఎలాగైనా తన దగ్గరికే వస్తుందని భావించాడు. ఈ క్రమంలో జూన్‌ 24 అర్ధరాత్రి దల్బీర్‌కు ఫోన్‌ చేసి రైల్వే ట్రాక్‌ దగ్గర్లోని జాఖీర వద్దకు రమ్మని చెప్పాడు. అనంతరం ఇటుక రాయితో అతడి తలపై మోది చంపేశాడు. అనంతరం స్నేహితుడి శరీరాన్ని రైల్వే ట్రాక్‌పై పడేశాడు. దీంతో దల్బీర్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు అందరినీ నమ్మించవచ్చని భావించాడు. తన ప్లాన్‌లో భాగంగా పోలీసులకు ఫోన్‌ చేసి రైల్వే ట్రాక్‌పై మృతదేహం ఉందని చెప్పాడు. అయితే గుల్ఖేశ్‌ ప్రవర్తనపై అనుమానం రావడంతో అతడి ఫోన్‌ కాల్స్‌ రికార్డును చెక్‌ చేశారు. దీంతో అసలు విషయం బయట పడింది. కాగా ప్రస్తుతం పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ హత్యలో మృతుడి భార్యకు కూడా ప్రమేయం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా