ఢిల్లీ-నోయిడా స‌రిహ‌ద్దులు బంద్‌

22 Apr, 2020 13:58 IST|Sakshi

ఢిల్లీ :  క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో  నోయిడా- ఢిల్లీ  స‌రిహ‌ద్దును మూసివేస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. నోయిడాలో న‌మోద‌వుతున్న కేసుల్లో అత్య‌ధికంగా ఢిల్లీకి సంబంధించిన‌వే అని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చేవ‌ర‌కు నోయిడా- ఢిల్లీ స‌రిహ‌ద్దు మూసివేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. లాక్‌డౌన్ ప‌టిష్టంగా అమ‌లుచేస్తున్నా దేశ రాజ‌ధానిలో కోవిడ్ కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉంది. ప్ర‌స్తుతం రెండువేల‌కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. వీటిలో చాలావర‌కు జ‌మాత్‌కు సంబంధం ఉన్న‌వాళ్లు, వారితో కాంటాక్ట్ అయిన‌వాళ్లు ఉన్నారు. 


నోయిడాలో ప్ర‌స్తుతం 28 హాట్‌స్ప‌ట్ల‌ను గుర్తించారు. ఈ నేప‌థ్యంలో క‌రోనా తీవ్ర‌త‌ను త‌గ్గించేందుకు ఢిల్లీ-నోయిడా స‌రిహ‌ద్దు మూసివేయాల‌ని జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ అధికారుల‌ను ఆదేశించారు. ప్రజలందరూ  దీనికి సహకరిస్తూ  ఇంట్లోనే  ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే అత్య‌వ‌స‌ర సేవ‌లందిస్తున్న వైద్యులు, మీడియా ఇత‌ర రంగాల వారికి  మిన‌హాయింపునిస్తూ పోలీస్ క‌మిష‌న‌ర్ పాస్‌లు జారీ చేశారు. 

>
మరిన్ని వార్తలు