పిజ్జా డెలివరీ బాయ్‌కి కరోనా..

17 Apr, 2020 02:24 IST|Sakshi

క్వారంటైన్‌లో 72 కుటుంబాలు   

సాక్షి న్యూఢిల్లీ:  దక్షిణ ఢిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్‌(19)కు కరోనా వైరస్‌ సోకినట్లు తేలడంతో 72 కుటుంబాలను ప్రభుత్వ అధికారులు క్వారంటైన్‌లో ఉంచారు. అతడితోపాటు పనిచేసే మరో 17 మంది పిజ్జా డెలివరీ బాయ్‌లను కూడా క్వారంటైన్‌కు తరలించారు. మాలవీయ నగర్‌లో ఓ పిజ్జా ఔట్‌లెట్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేసే యువకుడిలో కరోనా లక్షణాలు గత 20 రోజులుగా ఉన్నాయి. ఏప్రిల్‌ 14న కరోనా నిర్ధారణ పరీక్ష నివేదిక వచ్చింది. అతడు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆ డెలివరీ బాయ్‌ నుంచి గత 20 రోజుల్లో పిజ్జాలు అందుకున్న 72 కుటుంబాలను క్వారంటైన్‌లో ఉంచారు. ఆ పిజ్జా ఔట్‌లెట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. పిజ్జా డెలివరీ బాయ్‌ డయాలిసిస్‌ కోసం ఆసుపత్రికి వెళ్లాడని, అక్కడే కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.   

మరిన్ని వార్తలు